కేసీఆర్ పై గెలుస్తాననే మాటలు కట్టిపెట్టాలిః కౌశిక్‌ రెడ్డి

కేసీఆర్ కాలి గోటికి కూడా ఈటల సరిపోడన్న కౌశిక్ రెడ్డి

హైదరాబాద్ః తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించుతామని బీజేపీ నేతలు అంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తానని బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈటలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కాలి గోటికి కూడా ఈటల సరిపోడని ఆయన అన్నారు. హుజూరాబాద్ లో ఈటలకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. కేసీఆర్ పై గెలుస్తాననే మాటలు పక్కన పెట్టాలని… సొంత నియోజకవర్గం హూజూరాబాద్ నుంచే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. ఉప ఎన్నిక తర్వాత హుజూరాబాద్ లో కనీసం లక్ష రూపాయల అభివృద్ధి అయినా చేశారా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/