119 ఏళ్ళ కేన్‌ తనకా మృతి

ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కురాలిగా రికార్డు

119-year-old Kane Tanaka died
119-year-old Kane Tanaka died

ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కురాలు , జపాన్‌కు చెందిన ఆ వృద్ధురాలి పేరు కేన్‌ తనకా(119) కన్ను మూసింది. 1903 జనవరి 2న జన్మించిన కేన్‌ తనకా ఈ నెల 19న తుదిశ్వాస విడిచారు. ఈమేరకు జపాన్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. వయోభారంతో ఆస్పత్రిలో ఉన్న ఆమె.. తన పనులు తానే చేసుకునే దాని ఆసుపత్రి నర్సులు పేర్కొన్నారు.

అయితే , తనకా తన శతాధిక జీవనం లో అనేక రికార్డులు నెలకొల్పారు. 2019 మార్చిలో తన 116వ ఏటలోకి ప్రవేశించి ప్రపంచంలో అతిపెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందారు. 2020 సెప్టెంబరు నాటికి 117 సంవత్సరాల 261 రోజుల వయసు పూర్తి చేసుకుని, జపాన్‌లో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా రికార్డుల కెక్కారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/