సొంత బ్యానర్ లో నటిస్తున్న ‘మహానటి’

26 నుంచి రెగ్యులర్ షూటింగ్

keerthy suresh movie under own banner
keerthy suresh movie under own banner

కీర్తి సురేష్ … ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా మలయాళీ భామ. ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డ్ అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అర డజను చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో సినిమాని ప్రారంభించింది. తమ హోమ్ బ్యానర్ లో సినిమా కావటం విశేషం.
కీర్తి సురేశ్ తల్లిదండ్రులు కూడా సినీ నేపథ్యం ఉన్నవారే ఆమె తండ్రి మలయాళ నిర్మాత సురేష్ కుమార్. తల్లి మేనక అలనాటి హీరోయిన్. వీరు అప్పట్లోనే ‘రేవతి కళామందిర్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి చిత్రాలను నిర్మించారు. కీర్తి తన సొంత బ్యానర్ లో ‘పైలట్స్’ లో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ నటించింది. . ఇన్నాళ్లకు తన తల్లిదండ్రుల నిర్మాణంలో సినిమా చేస్తోంది. ‘వాశి’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మలయాళ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. థామస్ హీరోగా నటించనున్నారు. విష్ణు జి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 26 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సొంత బ్యానర్ లో సినిమా పట్ల కీర్తి సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేసింది.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/