దేశంలో కొత్తగా 10,302 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 10,302 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,99,925కు చేరాయి. ఇందులో 3,39,09,708 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,349 మంది మృతిచెందారు. మరో 1,24,868 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 267 మంది మృతిచెందగా, 11,787 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 5,754 కేసులు ఉండగా, 49 మంది మరణించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/