దసరా లోని ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసిన కీర్తి సురేష్ తల్లి

గత కొద్దీ రోజులుగా ఎక్కడ చూసిన ఒకే పాట వినిపిస్తుంది అదే ‘చమ్కీల అంగిలేసి’. నాని , కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ దసరా. మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ రేపు ( మార్చి 30 న) పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలంగాణ కు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కించారు. గత కొద్దీ రోజులుగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో నాని , కీర్తి సురేష్ బిజీ బిజీ గా పాల్గొంటూ సినిమా తాలూకా విశేషాలను తెలుపుతూ సినిమా ఫై ఆసక్తి నింపారు.

ఇక సోషల్ మీడియాలో అయితే ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ దుమ్ముదులుపుతుంది. ముఖ్యంగా ఈ పాటపై రీల్స్ మామూలుగా లేవు. తాజాగా ఈ సాంగ్ పై కీర్తి సురేశ్ తల్లి, అలనాటి తార మేనక సురేశ్ స్టెప్పులేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె ట్రెండ్‌కు అనుగుణంగానే దీనిని క్రియేట్‌ చేసినట్లు క్యాప్షన్ పెట్టారు. మరోవైపు, కీర్తి సోదరి భర్త సైతం ఈ పాటకు డ్యాన్స్‌ చేశాడు. మేనకతో కలిసి అతడు ‘చమ్కీల అంగిలేసి’ తమిళ వెర్షన్‌కు స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన కీర్తి ఫుల్ ఖుష్ అవుతుంది. మరి ఈ సాంగ్ సినిమా లో ఏ రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందో..సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.