బాలయ్యను మరోసారి అలా చూపిస్తానంటోన్న గోపీచంద్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకునేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

ఇటీవల మాస్ రాజా రవితేజతో క్రాక్ అనే బ్లాక్‌బస్టర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట. ఇప్పటికే బాలయ్య కూడా గోపీచంద్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యను ఓ పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తాడట ఈ డైరెక్టర్.

గతంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో లక్ష్మీనరసింహా చిత్రంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈసారి అంతకు మించిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య కనిపిస్తాడని గోపీచంద్ అంటున్నాడు. ఏదేమైనా బాలయ్యను మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూసేందుకు ఎప్పటినుండో ప్రేక్షకులు ఆసక్తిగా ఉండగా, గోపీచంద్ మలినేని వారి కోరికను తీర్చేందుకు రెడీ అవుతున్నాడు.