దేశాన్ని ఐక్యంగా నిల‌ప‌డ‌మే దేశం ప‌ట్ల ప్రేమ‌ః రాహుల్ గాంధీ

Keeping the country united is love for the country: Rahul Gandhi

వార‌ణాసి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు యూపీలో పర్యటిస్తున్నారు. భార‌త్ జోడో న్యాయ యాత్ర‌లో భాగంగా ఆయ‌న వార‌ణాసిలో ఉన్నారు. యాత్ర స‌మ‌యంలో ఎక్క‌డే ద్వేషాన్ని చూడ‌లేద‌న్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ మ‌ద్ద‌తుదారులు కూడా త‌న యాత్ర‌లో పాల్గొన్న‌ట్లు చెప్పారు. వాళ్లు త‌మ‌తో స్నేహ‌పూర్వ‌కంగా మాట్లాడిన‌ట్లు వెల్ల‌డించారు. క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తేనే ఈ దేశం బ‌లోపేతం అవుతుంద‌ని అన్నారు. దేశాన్ని ఐక్యంగా నిల‌ప‌డ‌మే దేశం ప‌ట్ల ప్రేమ‌ను చాటుతుంద‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.