ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్
ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ

Hyderabad: ఏపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రఘురామకృష్ణ రాజు ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124(A), 153(B), 505 IPC, 120(B) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగాఎంపీకి భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఆయన అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు.రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చర్చనీయాంశ మైంది.
గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును సైతం ఆయన ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/