మహారాష్ట్రలో కేసీఆర్ రెండో రోజు పర్యటన కు సంబదించిన వివరాలు

బిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్‌తో బయలుదేరిన సంగతి తెలిసిందే. సోలాపూర్ కు చేరుకున్న కేసీఆర్​కు BRS శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సోలాపూర్ నేత భగీరథ బాల్కే.. ఇతరులు బీఆర్ఎస్​లో చేరారు. స్థానిక నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలు కేసీఆర్​ను కలిశారు. అనంతరం రాత్రి అక్కడే బస చేశారు.

ఈరోజు ఉదయం కేసీఆర్ పండరీపురం వెళ్తారు. అక్కడ శ్రీ విట్టల్ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. విఠలేశ్వరునికి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి సర్కోలి వెళ్తారు. అక్కడ భారాస సభలో కేసీఆర్ పాల్గొంటారు. సోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్ బాల్కే సహా పలువురు ఇతరులు భారాసలో చేరతారు. అనంతరం సీఎం కేసీఆర్, నేతలు తుల్జాపూర్ వెళ్తారు. అక్కాడ్ తుల్జా భవాని అమ్మవారి దేవస్థానానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యే, సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.