హోంగార్డు రవీందర్ భార్య కు ప్రభుత్వ ఉద్యోగం…

ఉన్నతాధికారులు అవమానించారని ఆత్మహత్యాయత్నం చేసుకున్న హోంగార్డు రవీందర్..గత నాల్గు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. రవీందర్ మృతితో ఆసుపత్రి ముందు ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న హోంగార్డులు పెద్ద సంఖ్యలో డీఆర్డీవో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. రవీందర్ భార్య సంధ్య తో పాటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం తో ప్రభుత్వం దిగివచ్చింది. రవీందర్ భార్య తో మాట్లాడి..ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించింది. హోంగార్డు రవీందర్ అంత్యక్రియలకు చాంద్రాయణగుట్టలోని నల్లవాగు స్మశానవాటికలో జరిగాయి.

రవీందర్ భార్య సంధ్యకు ఏ ఉద్యోగం ఇస్తారానే దానిపై మాత్రం క్లారిటీ లేదు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత క్లారిటీ రానుంది. పోలీస్​డిపార్ట్ మెంట్ లో కాకుండా వేరే ఎక్కడైనా ఉద్యోగం కల్పించాలని కోరానని సంధ్య చెప్పారు. రవీందర్​భార్యను శనివారం (సెప్టెంబర్​ 9న) సీపీ దగ్గరకు తీసుకెళ్లనున్నారు. ఏ డిపార్ట్​ మెంట్ లో ఉద్యోగం ఇవ్వనున్నారనే విషయం సెప్టెంబర్ 9న తేలనుంది.