సిఎంకు చీమకుట్టినట్టైనా లేదు

కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నారు

Revanth Reddy arrested
Revanth Reddy arrested

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ‘కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సిఎంకు చీమకుట్టినట్టైనా లేదు. ‘ఎవడి పిచ్చి వాడికి ఆనందం’ అన్నట్టు కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయంపై 11 గంటల సుదీర్ఘ సమీక్ష చేయడం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్తను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ప్రగతిభవన్‌లో కెసిఆర్ నిన్న మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు సుదీర్ఘ సమావేశం జరిపినట్లు అందులో పేర్కొన్నారు. కొత్త సచివాలయంలో కార్యాలయాలు, పేషీలు, అంతస్తుల విస్తీర్ణాలపై చర్చ జరిగిందని చెప్పారు. మూడు రోజుల్లో సచివాలయం అంశంపై మరో సమావేశంలో సిఎం పాల్గొననున్నారని అందులో పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/