చంద్రబాబు ఫై వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫై వైస్సార్సీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కనిపిస్తే కొట్టాలని, తిట్టాలని ప్రజలను కోరారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శుక్రవారం హుకుంపేట మండలంలోని తీగలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమకు ఇళ్లు ఇప్పించాలని కోరారు.

స్పందించిన ఎమ్మెల్యే గిరిజనులకు ఇళ్లు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, వాటిని ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేసి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందువల్లే ఇళ్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని అన్నారు. అంతేకాదు, ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు కనిపిస్తే కొట్టాలని, తిట్టాలని వారికి సూచించారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలను అడిగి తెలుసుకోవడం , ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు వారిపై తిరగబడుతున్నారు. ప్రభుత్వ పధకాలు మాకు అందడం లేదు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్లయితే నేతలను కొట్టేంత పని చేసిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.