మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ప‌నుల పురోగ‌తిని ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు. ఫ‌స్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిల‌ర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను సీఎం నిశితంగా ప‌రిశీలించారు. ఉన్న‌తాధికారుల‌తో కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. పనులు ఏ దశలో ఉన్నాయి..? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అని అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు. పనులు ఏ దశలో ఉన్నాయి..? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అని అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు. ఇప్పటికే పవర్ ప్లాంట్ పనులు 70 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు 2015లో ప్రారంభమయ్యాయి. మొత్తం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది.

ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానం పూడి సైదిరెడ్డి, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నల్ల‌గొండ జ‌డ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జ‌డ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, తదితరులు ఉన్నారు.