ఉత్తరకాశీలో 3.2 తీవ్రత భూకంపం

earthquake

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. ఈరోజు తెల్లవారుజామున 3.49 గంటలకు ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఉత్తరకాశీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

గత 48 గంటల్లో రాష్ట్రంలో భూకంపం రావడం ఇది రెండోసారి. మంగళవారం పిథోరఘర్‌లో 4.3 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. అంతకుముందు అదే రోజు నేపాల్‌లో వరుసగా నాలుగు భూకంపాలు వచ్చాయి.