జాతిపిత మ‌హాత్మాగాంధీ కి కేసీఆర్ నివాళులు

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైద‌రాబాద్ : నేడు జాతిపిత మ‌హాత్మాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవ‌లు, త్యాగాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్మ‌రించుకున్నారు. దేశానికి గాంధీజీ అందించిన ఆశ‌యాలు, సిద్ధాంతాలు, విజ‌యాల స్ఫూర్తి.. తెలంగాణ రాష్ట్ర సాధాన‌, ప్ర‌గ‌తి ప్ర‌స్థానంలో ఇమిడి ఉంది. గాంధీజీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యానికి తెలంగాణ ప‌ల్లెలు ప్ర‌తిరూపాలుగా నిలిచాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు.