ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ‘సత్యమేవ జయతే ‘ నిరాహార దీక్ష

పాల్గొన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , నందమూరి, నారా కుటుంబ సభ్యులు

TS TDP party president Kasani Gnaneshwar Mudiraj, family members of Nandamuri, Nara participated in the ‘Satyameva Jayate’ hunger strike at NTR Trust Bhavan in Hyderabad on Monday

Hyderabad: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ లో ‘సత్యమేవ జయతే ‘ నిరాహార దీక్ష చేపట్టారు. మహాత్ముడు చూపిన అహింసా మార్గం ఆచరణీయమని నేతలు పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ని వెంటనే విడిచిపెట్టాలని కోరారు..

Nandamuri, Nara’s family members participated in the ‘Satyameva Jayate’ hunger strike at NTR Trust Bhavan in Hyderabad on Monday-

తొలుత బాపూజీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , నందమూరి, నారా కుటుంబ సభ్యులు, తెలంగాణ టీడీపీ రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/andhra-pradesh/