బీజేపీ నాయకులవి పాచిపోయిన ముఖాలంటూ మంత్రి మల్లారెడ్డి ఫైర్

బిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలి లో బిజెపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ నాయకులవి పాచిపోయిన ముఖాలని, వారి ఫేస్ వాల్యూ లేదని అన్నారు. ఈరోజు బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఖమ్మం లో జరుగుతుంది. ఈ సభ కు పెద్ద ఎత్తున నేతలు , కార్య కర్తలు హాజరయ్యారు. కేవలం రాష్ట్ర నేతలే కాకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు , మాజీ ముఖ్యమంత్రులు , ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భాంగా మంత్రి మల్లారెడ్డి సభ వేదికను పరిశీలిస్తూ బిజెపి నేతలపై పలు కామెంట్స్ చేసారు.

కేంద్రంలో బీజేపీ అధికారం ఉన్నా వారికి అభివృద్ధి చేసే సత్తా లేదని , దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని.. ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందిందా ? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలలో ఏ ఒక్కరైనా తెలంగాణ మోడల్‌ను చూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంతరి మల్లారెడ్డి సవాల్ చేశారు. బీజేపీకి ఐటీ, ఈడీ దాడులు చేయించటం తప్ప మరేం చేతకాదని అన్నారు. సీఎం కేసీఆర్ అంటే చరిత్ర అని.. సింగిల్, డబుల్ ఇంజన్ కాదు.. దేశాన్ని తెలంగాణ మోడల్ చేయడమే కేసీఆర్ లక్ష్యమని వ్యాఖ్యనించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ అవతార పురుషుడని.. ఆయన దేశాన్ని అభివృద్ధి చేయడానికే పుట్టాడని ప్రశంసల వర్షం కురిపించారు.