ప్రేమిస్తున్నానంటూ మహిళ డాక్టర్ ను వేధిస్తున్న పేషంట్

ఓ పక్క పోలీసులు , కోర్ట్ లు కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ మహిళల ఫై ఆగడాలు తగ్గడం లేదు. ప్రేమిస్తున్నాని వేధించడం..వారిపై దాడులు చేయడం చేస్తున్నారు. తాజాగా ఆరోగ్యం బాగాలేదని ఓ మహిళ డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషంట్..ఆ తర్వాత తనను ప్రేమిస్తున్నాని వెంటపడడం చేసిన ఘటన మొయినాబాద్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..

మొయినా‌బాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తూ క్లినిక్ నడుపుకుంటోంది. గ్రామానికి చెందిన పాటి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వారం రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో ఆమె వద్దకు వచ్చి చికిత్స చేయించుకున్నాడు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఫోన్ చేస్తానని చెప్పి ఆమె ఫోన్ నెంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత నుండి ఆమె ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టటం చేస్తున్నాడు.

అతడి మెసేజ్ లకు రిప్లయ్ ఇవ్వకపోవడం తో ఈ నెల17వ తేదీ మధ్యాహ్నం నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో ఎవరూ లేని సమయం చూసి… నువ్వంటే నాకిష్టం నిన్ను ప్రేమిస్తున్నాను అని చెపుతూ.. ఓ ముద్దిస్తే రూ. 25 వేలు ఇస్తా.. నీ ఆస్పత్రికి 5నెలల రెంట్ కడతానని చెప్పుకొచ్చాడు. ఇంకా అసభ్యకరంగా మాట్లాడుతూ డాక్టర్‌ను వేధించటం మొదలెట్టాడు. కాసేపు తరువాత అక్కడి నుండి అతడు వెళ్లిన తర్వాత కుటుంబ సబ్యులకు జరిగిన విషయం తెలిపి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసాద‌రెడ్డి పై నిర్భయ కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.