హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య పాల్పడ్డాడు. తాను ఉంటున్న రూమ్‌లోనే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. గచ్చిబౌలి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోల్‌కతాలోని చందానగర్ ప్రాంతానికి చెందిన అగ్నిశ్వర్ చక్రవర్తి (30) కొండాపూర్‌లోని ప్రశాంత్‌నగర్ కాలనీలో స్నేహితుడు సప్తర్షి ముఖర్జీతో నివసిస్తూ స్థానికంగా ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండురోజుల క్రితం అగ్నిశ్వర్ రూమ్ మేట్ సప్తర్షి వైజాగ్ వెళ్లాడు. ఆ సమయంలో అగ్నిశ్వర్కు అతని సోదరి ఫోన్ చేసింది. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించక పోవడంతో అనుమానం వచ్చి అతని రూమ్ మేట్ సప్తర్షికి కాల్ చేసింది. దీంతో వైజాగ్ నుంచి వచ్చిన సప్తర్షి సోమవారం ఉదయం ఫ్లాట్ వచ్చి చూడగా తలుపులు మూసిఉన్నాయి. ఎన్నిసార్లు తలుపు కొట్టిన తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సప్తర్షి పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలి వెళ్లి చూశారు. అగ్నిశ్వర్ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. అయితే అతని ఆత్మహత్యకుగల కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/