శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

తిరుమల: జూలైకి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచారు. వీటితో పాటు జూలైకి సంబంధించిన గదుల కోటాను ఈనెల 23న బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. https://tirupatibalaji.ap.gov.in/ వెబ్‌సైట్‌లో భక్తులు టికెట్లు, గదులను బుక్‌ చేసుకోవచ్చు. దర్శన సమయాల్లో మాస్క్‌ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/