సైదాబాద్ నిందితుడి కోసం రంగంలోకి దిగిన సజ్జనార్‌

సైదాబాద్ నిందితుడి కోసం రంగంలోకి దిగిన సజ్జనార్‌

సజ్జనార్‌ ..ఈ పేరు చెపితే కామాంధులకు వణుకు పుట్టాల్సిందే. దిశ ఘటన కామాందులను పిట్టలను కాల్చినట్టు కాల్చి దడ పుట్టించిన ధీరుడు. అలాంటి సజ్జనార్‌ ఇప్పుడు సైదాబాద్ నిందితుడి కోసం రంగంలోకి దిగాడు.

సైదాబాద్ సింగరేణి కాలనీ లో రాజు అనే యువకుడు ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి..చంపేసి పారిపోయాడు. గత నాల్గు రోజులుగా ఈ కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆయనగాని ఇతడి ఆచూకీ దొరకడం లేదు. ఈ తరుణంలో పోలీసులు నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామంటూ హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ప్రకటన విడుదల చేసారు.

ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు. నిందితుడు రాజు కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబంధీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ బస్సులు ఎక్కే ప్రయాణికుల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిందితుడి ఫోటోలను అన్ని బస్టాండుల్లో అంటించాలని ఆదేశించారు.