ఉమ్మడి ఖమ్మం జిల్లాలో KCR రోడ్ షో.. షెడ్యూల్ ఖరారు

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్..లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్..తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల 24న మిర్యాలగూడ నుంచి యాత్ర మొదలుపెట్టి వచ్చే నెల పదో తేదీన సిద్దిపేట బహిరంగసభతో ముగించనున్నారు. ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టనష్టాలు తెలుసుకోనున్న కేసీఆర్ సాయంత్రం వేళ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకొని రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఈ నెల 29న ఖమ్మంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. 30న తల్లాడ, కొత్తగూడెంలో మాజీ సీఎం రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి. మే 10న సిద్దిపేటలో ఈ యాత్ర ముగుస్తుంది.

కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ చూస్తే..

ఈ నెల 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్‌ రోడ్‌ షో
25న భువనగిరి
26న మహబూబ్‌నగర్‌
27న నాగర్‌కర్నూల్‌
28న వరంగల్‌
29న ఖమ్మం
30న తల్లాడ, కొత్తగూడెం
మే 1న మహబూబాబాద్‌
2న జమ్మికుంట
3న రామగుండం
4న మంచిర్యాల
5న జగిత్యాల
6న నిజామాబాద్‌
7న కామారెడ్డి, మెదక్‌
8న నర్సాపూర్‌, పటాన్‌చెరు
9న కరీంనగర్‌
10న సిరిసిల్ల, సిద్దిపేట