నేడు భువనగిరిలో సీఎం రేవంత్ పర్యటన

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి జోరు పెంచారు. ఈరోజు ఆయన భువనగిరిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో స్థానిక స్పిన్నింగ్ మిల్లులో అధికారులు హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరికి చేరుకుంటారు. హైదరాబాద్ చౌరస్తా జగదేవ్ ప్పూర్ రోడ్, పాత బస్టాండ్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాట్లాడతారు.

హెలిప్యాడ్‌తో పాటు కార్నర్ సమావేశం నిర్వహించే స్థలాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసుల బందోబస్తు నిర్వహించనున్నారు. రోడ్‌షోలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సీఎం పర్యటనలో పాల్గొనున్నారు. నిన్న మెదక్ లో పర్యటించిన రేవంత్..బిఆర్ఎస్ , బిజెపి లపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు.