చెప్పులు మోసిన చేతులతో బండి సంజయ్ లక్ష్మీనరసింహా స్వామిని తాకాడు – కేటీఆర్

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం హైకోర్టు కొనుగోలు అంశంపై కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితులను రిమాండ్ కు పోలీసులు కోరగా..హైకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటె ఈ కేసు ఫై మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఈ కేసులో చట్టం తనపని తాను చేసుకుని పోతుందని మంత్రి అన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తానేం మాట్లాడనని తెలిపారు. ఈ వ్యవహారంలో బీజీపీ పాత్ర లేదంటూ యాద్రాద్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేయటంపై కేటీఆర్ ఘూటుగా స్పందించారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమవుతాయా ? అని ప్రశ్నించారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో లక్ష్మీనరసింహా స్వామిని తాకారని అన్నారు. ప్రజలకు దొంగ ఎవరో.. దొర ఎవరో అర్థమైంది. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి.
ఇప్పుడు మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు. పరిశోధన చేస్తున్న సంస్థలు సమాచారం ఇస్తాయి. మేం బాధ్యత గల వ్యక్తులం. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా సీఎం, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయి. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడము. తొందర పడవద్దని మా పార్టీ నాయకత్వానికి చెప్పా. సమయానుసారం సీఎం అన్ని విషయాలు మాట్లాడతారు” అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.