రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశ్యస్తమున్నదని కేసీఆర్ అన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

హిందూ సంస్కృతిలో దీపావళి విజయానికి ప్రతీకగా, మన జీవితాల్లో వెలుగులు నింపే విశిష్టతను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌స్తావించారు. సంకల్పం, చైతన్యంతో ముందుకు సాగేందుకు పండుగ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. బాణాసంచా కాల్చేటప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ద్వారా ప్రజలు బాధ్యతాయుతంగా దీపావ‌ళిని జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.