ఏపికి ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన గవర్నర్​

venkaiah-naidu-who-reached-gannavaram-was-welcomed-by-the-governor

అమరావతిః రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్​కు చేరుకోనున్నారు. జాతీయకవి దామరాజు ‘పుండరీకాక్షుడు’ అనే పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాల వజ్రోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రేపు ఉదయం ఉప రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/