అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు షాకింగ్ న్యూస్..

కరోనా కారణంగా చాల నెలలు థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో సినీ ప్రేమికులు ఓటిటికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో పలు ఓటిటి సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించి తమ సంస్థ వైపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ అతి కొద్దీ సమయంలోనే విపరీతమైన మెంబర్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ మెంబర్స్ కు షాక్ ఇచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీలను భారీగా పెంచింది. పెంచిన ధరలను నేటి నుంచి (డిసెంబర్‌ 14) భారత్‌లో అమలు చేయనుంది. దీంతో యూజర్లకు భారం తప్పదు.

గతంలో నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి(38శాతం) పెంచింది. మూడు నెలల సబ్‌ స్క్రిప్షన్‌ ధర రూ.329 ఉండగా రూ.459కి(39శాతం) పెరిగింది. వార్షిక సబ్‌ స్క్రిప్షన్‌ ధర రూ. 999 ఉండగా అది కాస్త రూ.1,499కి(50 శాతం) పెరిగింది. అమెజాన్‌ ప్రైమ్‌ ప్యాకేజీలతో విస్తృతమైన సేవలు(షాపింగ్‌, ఫాస్టెస్ట్‌ డెలివరీ, ఓటీటీ, మ్యూజిక్‌,..ఇలా) అందిస్తున్నందున.. పెరుగుతున్న భారం నేపథ్యంలోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది అమెజాన్‌. అమెజాన్‌ ఐదేళ్ల కిందట భారత్‌లో అడుగుపెట్టగా.. మధ్యలో మంత్లీ ప్యాక్‌ను తేవడం, ధరలను సవరించడం ఓసారి చేసింది.