ఆర్టీసీని అమ్మితే 1000 కోట్లు ఇస్తామని మోడీ ఆఫర్ ఇచ్చాడు – కేసీఆర్

పెట్రోల్ ధరలపై భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా పేరు చెప్పి పెట్రోల్ ధరల గురించి మాట్లాడతారా అని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఏ ఒక్క రోజు కూడా మ‌నం డీజిల్ ధ‌ర, పెట్రోల్ ధ‌ర పెంచలేదన్నారు. కానీ కేంద్రం ఆకాశ‌మెత్తు పెంచిన డీజిల్ ధ‌ర‌ల‌తో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం ప‌డుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చి ఆ సంస్థ‌ను మ‌నం బ‌తికిస్తున్నం. ఆర్టీసీని జ‌ల్దీ అమ్మేయాల‌ని ప్ర‌ధాని ఆఫర్లు పెట్టినట్లు కేసీఆర్ తెలిపారు.

ఆర్టీసీని అమ్మితే 1000 కోట్లు ఇస్తామని మోడీ ఆఫర్ ఇచ్చాడని ప్లీనరీ సభలో కేసీఆర్ అన్నారు. ప్ర‌ధాని ఆర్టీసీని అమ్మినోళ్ల‌కు 1000 కోట్ల రూపాయ‌లు బ‌హుమ‌తి పెట్టిండు. ఆయ‌న అమ్మేది చాల‌ద‌ట‌. మ‌నం కూడా అమ్ముకోవ‌న్న‌ట‌. ఉన్న సంస్థ‌లన్నీ ప్రైవేట్ ప‌రం చేయండి. ఏ రాష్ట్ర‌మైతే అమ్ముత‌దో ..వారికి వెయ్యి కోట్ల ప్రైజ్ మ‌నీ పెట్టిన ఘ‌నుడు మ‌న ప్ర‌ధాన మంత్రి అని..ఇది జరిగే క‌థ‌. వాస్త‌వమ‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. దేశంలో కరోనా విజృంభణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పెట్రో ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు తగ్గించడం లేదన్నారు. ఏపీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించడం లేదన్నారు. మోడీ వ్యాఖ్యల ఫై కేసీఆర్ ప్లీనరీ లో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.