భారత్‌లో కొత్త‌గా 64,553 మంది క‌రోనా

మొత్తం కేసులు 24,61,191…మొత్తం మృతుల సంఖ్య 48,040

corona virus – india

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. దేశ‌వ్యాప్తంగా గ‌‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 64,553 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం క‌రోనా కేసు‌లు 24,61,191కి చేరాయి. ఇందులో 6,61,595 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 17,51,556 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల కొత్త‌గా 1007 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 48,040కి పెరిగాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,76,94,416 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/