నేడు నల్గగొండ జిల్లాలో సీఎం కెసిఆర్ పర్యటన

హైదరాబాద్: నేడు సీఎం కెసిఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మరణించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ సంతాపసభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం హెలీకాప్టర్‌లో హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లికి చేరుకొని అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి, వారితో మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/