కర్ణాటక ఎన్నికల విషయంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం

CM KCR

మే నెలలో కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.

ఈ విషయాన్ని జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి వెల్లడించారు. ఈసారి కర్ణాటక ఎన్నికల్లో 59 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి అవుతానని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. జేడీఎస్ ఇప్పటికే 97 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించగా, కాంగ్రెస్ 165 మంది పేర్లను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదు. ఇక ముందు నుండి కూడా బిఆర్ఎస్ – జేడీఎస్‌ ల మధ్య మంచి సన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ పార్టీ ప్రారంభానికి కుమారస్వామి రావడం..కేసీఆర్ కు భరోసా ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా తనవంతు సాయం చేస్తున్నాడు.