నంద్యాలలో ఆగ్రో ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీకేజీ

కంపెని జనరల్‌ మేనేజర్‌ మృతి

as-leakage-in-spy-agro-industries

కర్నూలు : నంద్యాలలోని ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్‌ లీకైన సంఘటనలో జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతి చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ఫ్యాక్టరీలో ఉన్నవారిని బయటకు తరలిస్తున్నారు. అమ్మోనియా గ్యాస్‌ను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. మరోవైపు ఆగ్రో ఫ్లాంట్‌ చుట్టూ గ్యాస్‌ వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, వైద్య, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/