మే 20 నుండి జూన్ 5 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు – కేసీఆర్

kcr cabinet meeting updates
kcr cabinet meeting updates

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 20 నుండి జూన్ 5 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్ మీటింగ్ కొనసాగుతుంది. ఈ మీటింగ్ కు మంత్రులు , అధికారులంతా హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో భేటీ జరుగుతున్నది. కేబినెట్‌లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చిస్తున్నారు.

ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండా మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ధాన్యం సేకరణపై కేంద్రానికి సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ ముగుస్తుండంతో ఈ అంశంపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరోపక్క తెరాస నేతలు పెద్ద ఎత్తున బండి సంజయ్ ఫై మాటల యుద్ధం చేస్తూ వచ్చారు. భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి రోజున బండి సంజ‌య్ పాద‌యాత్ర ప్రారంభించ‌డం.. ఆ మ‌హానీయుడి ఆత్మ‌ను క్షోభ పెట్ట‌డమేన‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు వ్యాఖ్యానించారు. బండి సంజ‌య్ చావాల‌ని కోరుకోవ‌డం లేదు.. కానీ ఆయ‌న చ‌స్తే రైతుబీమా కింద రూ. 5 ల‌క్ష‌లు ఇప్పిస్తామ‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.