‘గని’ నిరాశపరచడం ఫై వరుణ్ తేజ్ కామెంట్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – కిరణ్ కొర్రపాటి కలయికలో అల్లు బాబీ నిర్మించిన చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడం లో విఫలమైంది. మొదటి రోజు మొదటి ఆట తోనే డివైడ్ టాక్ రావడం తో ఆ ఎఫెక్ట్ చిత్ర కలెక్షన్ల ఫై భారీగా పడింది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ సినిమా ఫై సోషల్ మీడియా లో పలు కామెంట్స్ పోస్ట్ చేసారు.

తనను ఇన్ని ఏళ్ల నుంచి ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపిన మెగా ప్రిన్స్..‘గని’ చిత్రంలో భాగస్వాములైన అందరికీ థాంక్స్ చెప్పారు. ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి సినిమా కోసం పని చేశారని వివరంచారు. మంచి చిత్రాన్ని అందించడానికి తాము ఎంతో కష్టపడ్డామని, కానీ, తాము అనుకున్న ఆలోచన వెండితెరపైన ఎందుకో ఆవిష్కృతం కాలేదని తెలిపారు. తాను ప్రతీ సినిమా కోసం ఎంతో కష్టపడ్తానని, ఆ మూవీ ద్వారా అందరినీ ఎంటర్ టైన్ చేయాలని అనుకుంటానని అన్నారు. ఈ ప్రాసెస్ లో తాను కొన్ని సార్లు విజయాలు సాధిస్తానని, మరి కొన్ని సార్లు నేర్చుకుంటానని తెలిపారు. అయితే, ఈ క్రమంలో తాను కష్టపడి పని చేయడం మాత్రం ఆపబోనని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ తో కలిసి చేసిన ఎఫ్ 3 మూవీ మే 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎఫ్ 2 కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

pic.twitter.com/MXtMtBofR2— Varun Tej Konidela (@IAmVarunTej) April 12, 2022