మెగా పవర్ స్టార్ ఫై ప్రశంసలు కురిపించిన ప్రియాంక చోప్రా

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫై ప్రశంసలు కురిపించింది.ఇండియన్ బ్రాడ్ పిట్ గా అభివర్ణించింది . చరణ్ – ప్రియాంక జంటగా తూఫాన్ మూవీ లో నటించారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది. అప్పటి నుండి ఏదొక సందర్భం లో చరణ్ గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో యాంకర్ రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ అడుగగా..అవును ఖచ్చితంగా రామ్ చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ అనొచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ గ్లోబల్ వైడ్ ఫుల్ క్రేజ్ ను సంపాధించుకున్నాడు. అలాగే చాలా మంచి వ్యక్తి” అంటూ చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ గురించి ప్రియాంక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం చరణ్..శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.