చంద్రగిరి లో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడిక్కడే నలుగురు మృతి

తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు. చనిపోయిన వారిని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా కూడా తిరుమల స్వామి వారిని దర్శించుకుని కాణిపాకం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కారు కల్వర్ట్‌లో ఇరుక్కున్న దాన్ని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేశారు. ఇక, గడ్డపార సహాయంతో కల్వర్టుపై ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలు కొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీసేశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ AP 26 BH 3435 .