కనిగిరిలో ఘోరం : మహత్మాగాంధీ విగ్రహ మెడలో వైసీపీ కండువాలు..

కనిగిరిలో ఘోరం : మహత్మాగాంధీ విగ్రహ మెడలో వైసీపీ కండువాలు..

ప్రకాశం జిల్లా కనిగిరిలో మహత్మాగాంధీ విగ్రహం మెడలో గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ కండువాలు వేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాంధీ విగ్రహం మెడలో వైసీపీ కండువాలు వేయడం అపచారంగా భావిస్తున్నారు. ఈ ఘటన పట్ల దళిత సామాజిక వర్గాలు ఆందోళనకు దిగారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలంటూ.. డిమాండ్ చేస్తున్నారు.

ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఇదిలావుంటే కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి కూడా ఆదివారం వైసీపీ జెండాను తగిలించారు. దీనిపై దళిత నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కారుకులను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా పోలీ్సస్టేషన్ ఆవరణలోని మహత్ముని విగ్రహం మెడలో వైసీపీ కండువాలు వేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.