తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉంది

టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక సమావేశంలో మంత్రి కేటిఆర్

TS Minister KTR
TS Minister KTR

Hyderabad: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా తీవ్రత పరిస్థితులు తగ్గాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక సమావేశం సచివాలయంలో జరిగింది. అందరి సహకారంతో కరోనా గండం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని అన్నారు . రోజూ ఆక్సిజన్ ఆడిటింగ్ జరుగుతోంది. అవసరానికి మించి ఆక్సిజన్, ఔషధాలు వాడకుండా చూస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో మంత్రులు పూర్తి స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నారు. ఈ భేటీలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌తో పాటు సీఎంవో ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/