ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఇప్పటికే ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చగా…ఇప్పుడు ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సీబీఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. మరో ఆమె కు బెయిల్ వస్తుందా..రాదా అనేది చూడాలి.