జగన్‌ పాలనలో ఉపాధి అవకాశాలు లేక యువత వలసలు పోతున్నారుః : అచ్చెన్నాయుడు

atchannaidu

అమరావతిః టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సిఎం జగన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. సిఎం జగన్‌ మూడేళ్ల పాలనలో ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు యువత వలసలు పోతున్నారని ఆయన తెలిపారు. కనీసం మూడు పరిశ్రమలైనా రాష్ట్రానికి తీసుకురాలేదని తెలిపారు. టిడిపి హయాంలో చంద్రబాబు తీసుకొచ్చిన పరిశ్రమలను తనవిగా జగన్‌ ప్రచారం చేసుకుంటు న్నాడని ఆరోపించారు. సిఎం దావోస్‌ పర్యటనలో ఏపీ ఎలాంటి ప్రయోజనం కలగలేదని, గడిచిన మూడేళ్లలో ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టారని విమర్శించారు. కక్ష సాధింపుతో భవంతులు పడగొట్టడం తప్ప ఏం సాధించారని పేర్కొన్నారు.

మరోవైపు సిఎం జగన్‌ కనుసైగలతో పోలీసులు ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టిడిపి నాయకుడు బుద్ధా వెంకన్న ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను, ప్రజలను అరెస్టు చేస్తూ సహనాన్ని పరిక్షీస్తున్నారని అన్నారు. ఇదే తీరు ఉంటే తాడేపల్లి ప్యాలెస్‌ను చుట్టుముడతామని హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/