సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ

cbi-issues-notices-to-kavitha

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి మరోసారి లేఖ రాసారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు ఉండటంతో పాటు ఈనెల 6న విచారణకు రావాలని సీబీఐ తెలిపింది.

సీబీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్‌ను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను చూశాను. దాంట్లో నా పేరు ఎక్కడా లేదు’ అని తెలిపారు. ఈ కేసులో వివరణ కోసమే సీబీఐ ఇచ్చిన నోటీసులపై కవిత ప్రతిస్పందిస్తూ.. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన విషయం విధితమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ కి సమాధానంగా మరో లేఖ రాసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..సోమవారం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో ఆమె భేటీ కానున్నట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో సిబిఐ విచారణపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం.