ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

PM Modi casts his vote in Ranip

అహ్మదాబాద్‌ః గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ(చివరి దశ) ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని మోడీ కోరారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్ లో ఓటు వేయనున్నారు. గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలో ఉన్న 93 అసెంబ్లీ సీట్లకు చివరి విడత పోలింగ్‌ జరుగుతుండగా… 833 మంది పోటీలో నిలిచారు. కాగా 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అంతకు మునుపు యువ ఓటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రధాని మోడీ ఒక ట్వీట్‌లో కోరారు. కాగా డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో మొత్తం 63.14 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌ను ఏలుతోన్న బిజెపి మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుండగా ఆ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, ఆప్ భావిస్తున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/