వాళ్ల‌ను మానిట‌ర్ చేయ‌లేం.. నేర‌స్థుల‌కు మాత్ర‌మే అలా జ‌రుగుతుందిః సుప్రీంకోర్టు

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో పార్ల‌మెంట్‌కు ఎంపికైన నేత‌ల‌ను డిజిట‌ల్‌గా మానిట‌ర్ చేయాల‌ని పిటీష‌న్‌ దాఖ‌లైంది. అయితే ఆ పిటీష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మెరుగైన పాల‌న‌ను అందించేందుకు డిజిట‌ల్ మానిట‌రింగ్ చేయాల‌ని సురింద‌ర్ నాథ్ కుంద్రా పిటీష‌న్ దాఖ‌లు చేశారు. సీజే డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును వాదించింది. ఆ బెంచ్‌లో జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, జ‌స్టిస్ మ‌నోజ్ మిశ్రాలు ఉన్నారు. చ‌ట్ట‌స‌భ‌ప్ర‌తినిధుల‌కు చిప్‌లు పెట్టి మానిట‌ర్ చేయాల‌న్న ఆదేశాల‌ను కోర్టు ఎలా ఇవ్వ‌గ‌లుగుతుంద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. ఎంపీల‌కు కూడా రైట్ టు ప్రైవ‌సీ వ‌ర్తిస్తుంద‌ని కోర్టు చెప్పింది. ఎంపీల కాళ్ల‌కు, చేతుల‌కు చిప్‌ల‌ను పెట్టి వాళ్ల‌ను మానిట‌ర్ చేయ‌లేమ‌ని, నేర‌స్థుల‌కు మాత్ర‌మే అలా జ‌రుగుతుంద‌ని, నేత‌ల‌ను డిజిట‌ల్‌గా నిఘా పెట్ట‌డం కుద‌ర‌ద‌ని, ఎందుకంటే వాళ్ల‌కు ప్రైవ‌సీ హ‌క్కు ఉంటుంద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.