తాటికొండ రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు

ఎమ్మెల్యే , ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు ..బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. అతి త్వరలో తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి తమ సత్తా చాటుకోవాలని బిఆర్ఎస్ చూస్తుంది. ఈ క్రమంలో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు రాజయ్య కు అప్పజెప్పారు కేసీఆర్. ఆదివారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు తాటికొండ రాజయ్య.

గతంలో జరిగిన పరిణామాలను మరచిపోయి తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన రాజయ్యను కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు. తిరిగి వచ్చిన రాజయ్యకు కేసీఆర్‌కు వెంటనే బృహత్తర బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌ ఎంపీ ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని రాజయ్యకు కేసీఆర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పగించారు. ‘వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలి’ అని చెప్పి రాజయ్యకు సొంత నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు అప్పజెప్పారు.