ఈటెల లైసెన్సు వ్యాఖ్యలను ఖండించిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ

karimnagar cp response etela statements on licensed guns in huzurabad

హుజురాబాద్ లో విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇచ్చారని, తనకు గాని, తన కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ దే బాధ్యత అని హుజురాబాద్ బిజెపి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. నాది కాని, నా కుటుంబ సభ్యులది కానీ ఒక్క రక్తపు బొట్టు కారినా పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల ఫై కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పందించారు. ఈటల వ్యాఖ్యలను సీపీ ఖండించారు. ఈటల చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేశారు. తుపాకీ ప్రదర్శించిన ఇల్లంతకుంట ఎంపీపీ భర్తను గట్టిగా హెచ్చరించామని వెల్లడించారు. విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చే ప్రసక్తే లేదని , హుజూరాబాద్ నియోజకవర్గంలో కేవలం ఇద్దరికే లైసెన్సు కలిగిన తుపాకీలు ఉన్నాయని తెలిపారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటెల మరోసారి సీఎం కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కెసిఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అవసరాల కోసం ఉన్న వారేనని, కొద్ది రోజులు ఆగితే వారంతా టిఆర్ఎస్ నుండి బీజేపీ కి క్యూ కడతారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని పేర్కొన్న ఈటల రాజేందర్ సభా హక్కులను కాపాడవలసిన స్పీకర్ సభా హక్కులను కాలరాశారు అంటూ విమర్శించారు. సభ జరిగిన తీరును కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకపోవడం సిగ్గుచేటని ఈటల రాజేందర్ మండిపడ్డారు.