రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా..కమల్‌

పోటీ చేసే నియోజకవర్గంపై త్వరలో క్లారిటీ ఇస్తా

Kamal Hassan confirms contesting 2021 Tamil Nadu elections

చెన్నై: మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న విష‌యాన్ని మాత్రం త‌ర్వాత ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు క‌మ‌ల్ వెల్ల‌డించారు. ఆదివారం రోజున మ‌ధురైలో క‌మ‌ల్‌హాస‌న్ ర్యాలీ నిర్వ‌హించారు. భారీ సంఖ్య‌లో క‌మ‌ల్ పార్టీ అభిమానులు ఆ ర్యాలీలో పాల్గోన్నారు. ఇటీవల ప్రధాని మోడి కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌కు శంకుస్థాప‌న చేయ‌డాన్ని క‌మ‌ల్ త‌ప్పుప‌ట్టారు. సగం దేశం ఆక‌లి బాధ‌తో ఉంటే, కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్ అవ‌స‌ర‌మా అని క‌మ‌ల్ విమ‌ర్శ‌లు చేశారు. త‌మిళ‌నాడులో వ‌చ్చే ఏడాది మే నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/