కొంపదీసి ప్రాజెక్టుకు కూడా రంగులు వేయిస్తారా?

పోలవరంలో చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ చూడ్డానికి వెళ్లిన సిఎం జగన్ కు ధన్యవాదాలు.. గోరంట్ల

gorantla buchaiah chowdary
gorantla buchaiah chowdary

అమరావతి: సిఎం జగన్‌ ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే టిడిపి సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య మాట్లాడుతూ.. పోలవరంలో చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ చూడ్డానికి వెళ్లిన సిఎం జగన్ కు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టును గ్రాఫిక్స్ అన్నారు… మరి ఇప్పుడు ఏకంగా పర్యటనలు ఏంటో అని వ్యాఖ్యానించారు. అందుకే ఎఫ్2 సిఎం అంటున్నారని, ఫేక్ అండ్ ఫెయిల్యూర్ సిఎం అని విమర్శించారు. కొంపదీసి ప్రాజెక్టుకు కూడా రంగులు వేయిస్తారా? అని ఎద్దేవా చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/