ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం

వైసీపీ ఎంపీ విజయసాయి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ మధ్య ట్వీట్స్

VijayaSai Reddy Versus Rammohan Naidu
VijayaSai Reddy Versus Rammohan Naidu

Amaravati: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై. ‘ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేయిస్తే విమర్శించారని, మరి మహానాడులో స్టీల్ ప్లాంట్ పై తీర్మానం ఏది? అని విజయసాయి ప్రశ్నించారు. ‘’ఓ పోరాట యోధునిలా ఉగిపోయావుగా. తీర్మానం చేయడానికి ప్యాంట్లు తడిసిపోతే ఎలా? నువ్వా ఢిల్లీలో పోరాడేది. నిన్ను నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే’’ అని విజయసాయి ట్వీట్ చేశారు.

కాగా, దీనికి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘’ఢిల్లీ మెడలు వంచుతా అని శపధాలు చేసి, అక్కడికెళ్లి కాళ్ళు మొక్కుతోంది ఎవరో, ఎందుకో అందరికీ తెలుసు. పార్లమెంట్లో 28 ఎంపీలు ఉన్నా, ఒక్కరు కూడా అక్కడ గొంతెత్తి ప్రశ్నించకుండా, ప్రతిపక్షం సమావేశాల్లో ఎమీ మాట్లాడలేదు అంటూ దద్దమ్మ కబుర్లు చెపితే, మీ వెర్రితనం చూసి జనాలు నవ్విపోతారు. 28 ఎంపీలు ఉన్నారుగా, వచ్చే పార్లమెంట్ సెషన్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టే దమ్ము మీకుందా? రాష్ట్ర ప్రజల మంచి కోసం రాజకీయాలు పక్కన పెట్టి, ఆ తీర్మానానికి మనస్పూర్తిగా మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది!’’ అంటూ ఎంపీ రామ్మోహన్ ట్వీట్ చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/