గుణశేఖర్ పెద్ద కూతురు పెళ్లిలో సందడి చేసిన చిరంజీవి

దర్శకుడు గుణ శేఖర్ పెద్ద కుమార్తె నీలిమ పెళ్లి లో మెగా స్టార్ చిరంజీవి సందడి చేసారు. ప్రముఖ వ్యాపారవేత్త – పారిశ్రామికవేత్త శ్రీ శక్తి గ్రూప్ చైర్మన్.. డాక్టర్ రామ కృష్ణ పింజల- శ్రీమతి. సత్య పింజల కుమారుడు రవి ప్రక్య ను నీలిమ వివాహం చేసుకుంది. హైదరాబాద్ లోని ఫలుక్ నుమా ప్యాలెస్ లో ఈ వివాహం అట్టహాసంగా శనివారం జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ తో హాజరై వధూవరులకుఆశీస్సులను అందించారు.

గుణశేఖర్ సినిమాల విషయానికి వస్తే..దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి శాకుంతలం సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దుష్యంతుడి క్యారెక్టర్‌లో మలయాళ హీరో దేవ్ మోహన్ యాక్ట్ చేశారు. తెలుగు, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.