ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించండి – కేంద్రానికి YCP ఎంపీ డిమాండ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక హోదా అనేది మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల ..ప్రత్యేక హోదా ఫై పెద్ద ఎత్తున యుద్ధమే చేస్తుండగా..మిగతా పార్టీలు కూడా దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు హోదా అత్యవసరమన్నారు. దీనిపై కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించాలని కోరారు. ఆఫ్ షోర్ టెక్నో, ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ, పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.